ఈరోజు ఈనాడులో తెలుగు సాఫ్ట్‌వేర్ గురించి ప్రచురించారు …
******************************************************
”దేశభాషలందు తెలుగులెస్స”.. ”ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అన్న ప్రశంసలు తేనెలూరే మన తెలుగు భాషకు చరిత్ర అందించిన నజరానాలు. కానీ ఈ ఐటీ యుగంలో వీటితో సంతృప్తి పడితే సరిపోదు. నిరంతర స్రవంతిలా ప్రవహించటానికి ఆధునిక మార్పులు తేవాలి. కొత్త సొగసులు అద్దాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ ప్రయత్నం చేసింది. ‘తెలుగు సాఫ్ట్‌వేర్ ఉపకరణాలు’ పేరుతో ఒక సీడీని విడుదల చేసింది. దీనిలోని అంశాల రూపకల్పనలో గత తొమ్మిదేళ్లుగా పాల్గొంటున్న నిపుణుల్లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.ఉమామహేశ్వర్‌రావు ఒకరు. ఒక సాధారణ వ్యక్తి నుంచి భాషా పరిశోధకుని వరకూ అందరికీ ఉపయోగపడే అంశాలు ఎన్నో ఉన్న ఈ సీడీ గురించి ఆయన ‘ఈనాడు’కు వివరించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఎక్కడ దొరుకుతుంది?
ప్రభుత్వం ఈ సీడీని అందరికీ ఉచితంగా అందిస్తోంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నుంచి దీనిని పొందవచ్చు. లేకపోతే www.ildc.gov.in వెబ్‌సైట్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి?
లినెక్స్, విండోస్‌లలో ఏ ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా ఈ సీడీని ఉపయోగించుకోవచ్చు. విండోస్‌లో ఒక్కో వెర్షన్‌కు (98, మిలీనియం, ఎక్స్‌పీ వెుదలైనవి) ఒకో పద్ధతి ఉంటుంది. ఇదంతా సీడీలో ఉండే ‘రీడ్ మీ’ అన్న ఫైల్‌లో ఉంటుంది. దీనిని చదివితే ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో సులభంగా అర్థమవుతుంది.
దీనిలో ఏమున్నాయి?
నిఘంటువులు
* తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలకు సంబంధించిన ఏడు నిఘంటువులు ఉన్నాయి. ఇవి తెలుగు నుంచి తెలుగుకు, తెలుగు నుంచి ఇంగ్లిష్‌కు, ఇంగ్లిష్ నుంచి తెలుగుకు, ఇంగ్లిష్ నుంచి ఇంగ్లిష్‌కు, తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకు, హిందీ నుంచి హిందీకి పదాల అర్థాలను తెలియజేస్తాయి. తెలుగు, హిందీ భాషలకు సంబంధించిన నిఘంటువులలో దాదాపు 65 వేల పదాలున్నాయి. ఇక తెలుగు, ఇంగ్లిష్ భాషలకు సంబంధించిన నిఘంటువులలో దాదాపు 40 వేల పదాలున్నాయి.
* తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం, కన్నడ భాషలకు సంబంధించిన బహుభాషా నిఘంటువు కూడా ఒకటి ఉంది. ఒక భాషలో ఉన్న ఒక పదానికి మిగిలిన నాలుగు భాషల్లో అర్థాలు, పర్యాయపదాలు ఏమున్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కో భాషలోను 17 నుంచి 20 వేల పదాలను పొందుపరిచారు.
తెలుగు ఎనలైజర్
తెలుగులోని పదబంధాల గుట్టు విప్పి.. వాటిలో ఉన్న వ్యాకరణ రహస్యాలను చెప్పే టూల్ ఇది. తెలుగు నేర్చుకునేవాళ్లకు, పరిశోధకులకు ఉపయోగపడుతుంది. ఒక పదానికి ఉన్న సరైన రూపాన్ని (స్పెల్లింగ్) కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.
తెలుగు జనరేటర్
ఒక ఇంగ్లిష్ పదబంధానికి సరిపోయే తెలుగు పదబంధాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇంగ్లిష్ నుంచి తెలుగుకు అనువాదం చేయటానికి ఇది సహాయపడుతుంది.
తెలుగు ఎడిటర్
తెలుగులో రాసిన సమాచారాన్ని ఇంగ్లిష్, హిందీతో సహా వెుత్తం 13 భారతీయ భాషల లిపుల్లోకి దీనిద్వారా మార్చుకోవచ్చు. తెలుగును అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నా.. తెలుగు లిపిని చదవలేని వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు పొరుగురాష్ట్రాల్లోనో, వేరే దేశాల్లోనో మీ బంధువులు ఉన్నారనుకోండి. వారికి ఒక ఉత్తరాన్ని తెలుగులోనే రాసి వారికి అర్థమయ్యే లిపిలోకి (కన్నడ, తమిళం, ఒరియా, ఇంగ్లిషు…) మార్చి ప్రింట్‌తీసుకొని పోస్ట్ చేయవచ్చు. కంప్యూటర్ ద్వారానే అయితే ఈమెయిల్ చేయవచ్చు.
300 ఫాంట్లు
ఈ సీడీలో మొత్తం 300 రకాల ఫాంట్లు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన దానిని ఉపయోగించుకొని డిజైన్‌లు, గ్రాఫిక్‌లు చేసుకోవచ్చు. అంతేగాక, ఉన్న ఫాంట్లను మీ అభిరుచికి అనుగుణంగా మార్చి కొత్తవాటిని తయారుచేసుకోవటానికి కూడా వీలుండటం ఈ టూల్ ప్రత్యేకత.
తెలుగు-హిందీ అనువాదం
దీని ద్వారా తెలుగులో ఉన్న సమాచారాన్ని హిందీలోకి అనువదించుకోవచ్చు. దీనితో పెద్దపెద్ద తెలుగు పుస్తకాలను కూడా హిందీలోకి మార్చటానికి వీలవుతుంది.
తెలుగు భారతీయ ఒపెన్ ఆఫీస్
భారతీయ ఓపెన్ ఆఫీస్ సూట్‌కు తెలుగు రూపం ఇది. అన్ని ముఖ్యమైన ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ దీనిని వాడుకోవచ్చు. తెలుగులో టైప్ చేయటానికి, ప్రింట్‌లు తీసుకోవటానికి, ఈమెయిల్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది.
******************************************************
Taken from : 03/11/2005 Eeenadu http://www.eenadu.net/specialpages/sp-eenadumain.a...
Popularity: 1% [? ]
Tags: Technology, Telugu, telugublog, TeluguFont, telugulinksRelated Entries
- No related posts
Your Comments.
Leave your own response
No comments yet
Your Reply
If you wish to trackback to this post please use the following trackback address: http://www.chanduonline.com/2005/11/03/%e0%b0%ae%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%90%e0%b0%9f%e0%b1%80-%e0%b0%95%e0%b0%b3/trackback/
Spread the word.
Origami supports RSS (Real Simple Syndication), and Trackbacks from other blogs.
RSS feed for this post Trackback URI